24-06-2024 RJ
తెలంగాణ
జనగామ, జూన్ 24: జనగామ పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తాను బతికి ఉండగానే చనిపోయానంటూ తన భూమిని అధికారులు ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు సేవించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా నర్సింగరావు పలుమార్లు కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపాడు. తన ఆవేదనను అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తి ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.