24-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 24: ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఎమ్మెల్యేలు నిబంధనలు విరుద్దంగా పార్టీ మారడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంలో సవాల్ చేయాలని బిఆర్‌ఎస్ నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ తదితరులు పార్టీని వీడారు. ఈ క్రమంలో వీరిపై అనర్హత వేటు వేయించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ చెబుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటోంది. ఈనెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరిగింది. ప్రస్తుతం దానం నాగేందర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్ వెళ్లనుంది.