ad1
ad1
Card image cap
Tags  

  24-06-2024       RJ

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్దరణ

ఆంధ్రప్రదేశ్

  • మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ
  • డిసెంబర్‌ 10లోపు పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళిక
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు..కొత్తగా టైటిల్‌ డీడ్‌లు
  • జూలై నుంచి పెంచిన పెన్షన్‌ అమలు
  • గంజాయి నిర్మూలనకు హోంమత్రితో కమిటీ
  • ఎపి కేబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు
  • వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, జూన్‌ 24: దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఎపి కేబినేట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హెల్త్‌ వర్సిటీకి తిరిగి ఎన్టీర్‌ పేరును పునరుద్దరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే సిఎంగా చంద్రబాబు సంతకం పెట్టిన పలు అంశాలకు కూడా కేబినేట్‌ ఆమోదించింది.   ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ 
లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు.

డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు క్యాబినెట్‌ ముందుంచారు. జులై ఒకటి నుంచి పక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. పింఛన్ల పెంపు అంశంపైనా మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్దిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్‌, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు.

గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్‌ ఉండనున్నారు. 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతిభద్రతల అంశంపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. ఇకపోతే కేబినేట్‌ భేటీ వివరాలను మంత్రి పార్థసారథి వివరించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేసిందని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హావిూ ప్రకారం మెగా డీఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదించిందని వెల్లడించారు.

క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విూడియాకు వెల్లడిరచారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని నష్టం చేసింది. టెట్‌ పరీక్షను ప్రతి ఆర్నెళ్లకోసారి నిర్వహించాల్సి ఉండగా.. అలా చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారు. టెట్‌లో తమ మార్కులు ఇంప్రూవ్‌ చేసుకొనే అవకాశం కోల్పోయారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సీఎం ఆదేశించారని వివరించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చూస్తే చాలు.. గత ప్రభుత్వ పాలన ఏంటో తెలుస్తుంది. కేంద్రం చెప్పిన దానికి రాష్ట్రం అమలు చేసిన దానికీ అసలు పొంతన లేదు. భాజపా పాలిత రాష్ట్రం ఏ ఒక్కటీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు.

ఈ చట్టం వల్ల సన్న, చిన్నకారు రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. వివాదాలు వస్తే అప్పిలేట్‌ అథారిటీ ఎవరో చెప్పలేదు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంలో నేరుగా హైకోర్టుకే జ్యురిస్‌డిక్షన్‌ ఇచ్చారు. పేద రైతు ఎవరైనా ఖర్చులు భరించి హైకోర్టుకు వెళ్లగలరా? ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు నిర్ణయాన్ని క్యాబినెట్‌ ఆమోదించింది. రైతులందరికీ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇస్తాం అని అన్నారు. పింఛను పెంచిన మొత్తాన్ని రూ.4 వేలు జులై 1 నుంచి ఇస్తాం. పింఛను పెంపు వల్ల 65 లక్షల మందికి లబ్ది జరుగుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తాం. కొన్ని రకాల వ్యాధి బాధితులకు రూ.10వేలు పింఛను ఇస్తాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. వ్యవసాయ రంగంలోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అమలు చేస్తాం. గంజాయి నియంత్రణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ కమిటీలో సభ్యులుగా  హోం, విద్య, ఎక్సైజ్‌, గిరిజనశాఖ మంత్రులు ఉంటారు. గంజాయి సమస్యను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నాం.

రాష్ట్రంలో గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం. కమిటీ ఇచ్చిన సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. పేదవాడికి నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నాం. మొదట 183 అన్న క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభిస్తాం.. త్వరలో మరో 20 అన్న క్యాంటీన్లను తెరుస్తాం. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీగా మార్చాం. వర్సిటీ పేరు మార్పు వల్ల వైద్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో వైద్యులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఆ పేరును మార్పు చేశాం. రాష్ట్రంలో నైపుణ్య గణన కార్యక్రమానికి, రాష్ట్ర ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP