24-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 24: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జూనియర్ డాక్టర్లు జూడాలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహంతో జూడాలు చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూడాలు వెల్లడిరచారు. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా అంశాలపై ప్రతిపాదనలను మంత్రి ఉన్నతాధికారులకు పంపించినట్లు జూడాలు తెలిపారు. వైద్యుల భద్రత గురించి మంత్రి ఆలోచిస్తామన్నారని, స్టైఫండ్‌కు గ్రీన్ఛానల్పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు జూడాలు తెలిపారు.
సమ్మె కొనసాగింపుపై రాష్ట్రస్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైపెండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం, వైద్యకళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనే పలు డిమాండ్లతో జూడాలు సమ్మె చేస్తున్నారు.ఈ సమావేశంలో జూడాలు పలు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మరి కొన్ని అంశాలపై మరోమారు చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా అంశాలపై ప్రపోజల్స్ ఉన్నతాధికారులకు పంపిచినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి సమ్మె యధాతథంగా కొనసాగిస్తామని జూడాలు తెలిపారు.