24-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 24: మంత్రిగా నారా లోకేశ్ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను క్యాబినెట్ ముందు పెట్టే ఫైల్ పై ఆయన సంతకం పెట్టారు. అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేశ్‌కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, తెదేపా నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ’ఎక్స్’లో పోస్టు పెట్టారు. అప్పగించిన బాధ్యతలను లోకేశ్ సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యను మెరుగుపరిచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని, ప్రజాసేవ చేస్తూనే రాష్టాన్ని సుభిక్షమార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో మహిళలు గతంలో న్యాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని.. చంద్రబాబు నాయకత్వంలో ఆ పరిస్థితి మారిపోయిందంటూ మరో పోస్టు చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇక తగ్గినట్లేనన్నారు. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోమంత్రి అనిత, పోలీసు సిబ్బందికి ’ఎక్స్’ వేదికగానే అభినందనలు తెలిపారు. మహిళల భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నట్లు భువనేశ్వరి పేర్కొన్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన బ్రాహ్మణి, ’అంతా ప్లలెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి ప్లలె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్‌ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశారని, పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండిరచారని కొనియాడారు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావని లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు, నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా విూకు మా సహకారం ఉంటుందని, కంగ్రాట్స్ డియర్ అంటూ బ్రాహ్మణి చేసిన ట్వీట్ సోషల్ విూడియాలో వైరల్ గా మారింది.