25-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 25: ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి వైదొలిగారు. ’నాట్ బిఫోర్ విూ’ అంటూ ఆయన తప్పుకొన్నారు. ఆ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు పంపాలని రెజిస్టర్ ని ఆదేశించారు. వైకాపా హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. కీలక డాక్యుమెంట్లను మాయం చేశారనే ఆరోపణలు రావడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.