25-06-2024 RJ
సినీ స్క్రీన్
నివేదా థామస్ పెళ్లి చేసుకోనున్నారంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది. సస్పెన్స్‌కు తెరదించింది. కొత్త చిత్రాన్ని ప్రకటించి రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ’జెంటిల్ మేన్’తో తెలుగు తెరకు పరిచయమై తన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నివేదా ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీలో ’ఎన్నో రోజుల తర్వాత.. పైనల్లీ’ అని రాశారు. దీనికి లవ్ సింబల్‌ను జోడిరచారు. దీంతో ఈ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనుందని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ ’చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అని కొత్త సినిమాను ప్రకటించారు. దీంతో ఆమె పెట్టిన స్టేటస్ పెళ్లి గురించి కాదని.. కొత్త సినిమా గురించేనని క్లారిటీ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని నటుడు రానా నిర్మించడం మరో విశేషం. ’35 ఇది చిన్న కథ కాదు’ అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కనుంది.
ఈ సినిమా పోస్టర్‌ను రానా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తిరుపతి నేపథ్యంలో జరిగే కథ అని.. అందరి హృదయాలను హత్తుకుంటుందని ఆయన తెలిపారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. ఈ చిత్రంతో నందకిశోర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటిస్తుండగా సీనియర్ నటి గౌతమి ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.