26-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 26: తెలుగుదేశం పార్టీ ఆంధప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఈ నెల28న శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవాహం మధ్యాహ్నం 01:45 గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు నాయకులు హాజరుకానున్నారు. గతంలో విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేయడంతో గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. జూన్ 16న పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.