26-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 26: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సర్కార్ ఏర్పడిన తరవాత మంత్రులు వరుసగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా.. పలువురు మంత్రులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఈ రోజు రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మొదట వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న ఆయన.. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు కుటుంబ సభ్యులు, ఆ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. 2014-19లో ఆర్ అండ్ బీ శాఖకు బడ్జెట్‌లో14 వేల 970 కోట్ల రూపాయలు కేటాయించగా రూ.12 వేల 64 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.. అంటే 80 శాతం నిధులు ఖర్చు చేసినట్టు చెప్పారు.
కాగా, గత ప్రభుత్వం 2019`24లో ఆర్ అండ్ బీకి రూ.19 వేల 428 కోట్లు బడ్జెట్ ల్లో కేటాయించింది కేవలం రూ.9 వేల 15 కోట్లు.. అనగా 46 శాతం మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన రూ. 2 వేల 261 కోట్లకు బిల్లులు చెల్లించ లేదని దానివల్ల పనులు చేసినా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని.. ఇప్పుడు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈకార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డా.యువరాజ్,ఆర్ అండ్ బి ఇఎన్సిలు కె.నయీముల్లా, వేణుగోపాల్ రెడ్డి,సిఇలు శ్రీనివాసులు రెడ్డి,రామచంద్ర, వెంకటేశ్వరరావు,సుకన్య, బుచ్చిరాజు,ఇతర అవార్డులు పాల్గొన్నారు.