26-06-2024 RJ
తెలంగాణ
నల్గొండ, జూన్ 26: మునుగోడు నియోజకవర్గంలోని సంస్థన్ నారాయణపురం మండలంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మండల నాయకులు ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా.. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చౌటుప్పల్ కోర్ట్ బార అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, ఎంపీ అభ్యర్థి నర్రీ స్వామి కురుమ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి.
కాబట్టి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూళ్లలో ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలకు 25% సీట్లను కేటాయించాలని మనకు విద్యా హక్కు చట్టం 2009 ఒక ప్రాథమిక హక్కుగా.. ఈ యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి యొక్క సామాజిక కార్యకర్త పేద ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులకు ప్రతి ప్రైవేటు అండ్ కార్పొరేట్ స్కూల్స్ లలో ఉచిత ప్రవేశాలు ఇవ్వవలసిందిగా పోరాటాలు నిర్వహించాలని ఎవరైనా మమ్ములను సంప్రదించినట్లయితే వారికి న్యాయపరమైన సలహాలు సూచనలు తెలియజేస్తామని విద్యా హక్కు చట్టం సంపూర్ణ అమలు కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
విద్యా హక్కు చట్టం చట్టం గురించి తెలుసుకోవాలంటే 9032550076ని సంప్రదించవచ్చని పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, అనిల్ కొలను ఈశ్వర్, ముషం చంద్రశేఖర్, జగన్, రిపోర్టర్ కె.వి .శంకర్ తదితరులు పాల్గొన్నారు.