26-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు, జూన్ 26: సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం అని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.. రానున్న రోజుల్లో కుప్పంలో సహా జిల్లాలో అభివృద్ధి పనుల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానమన్న ఆయన.. సాయంత్రం 6 గంటల తరువాత మంత్రులు సమావేశాలు పెట్టకండని చెప్పాను అన్నారు.. బలవంతపు జనసవిూకరణతో పెద్ద పెద్దవిూటింగ్‌లు, భారీ కాన్వాయ్ లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండబోవు అన్నారు.. ఇక, అధికారులు ఫిజికల్.. వర్చ్యువల్ పని విధానాలకు సిద్ధపడాలని సూచించారు.
కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.. మరోవైపు.. కుప్పంలో రౌడీయిజం, హిసం, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు అని స్పష్టం చేశారు.. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తేవేయండి అన్నారు.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుండే శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడిరచారు. మరోవైపు.. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది.. పీఈఎస్ మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణుల సమావేశం అనంతరం.. రెండు రోజుల కుప్పం పర్యటన ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు సీఎం చంద్రబాబ నాయుడు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ప్రజలు.. తమ సమస్యలను సీఎంకు వివరించారు. వినతులను సీఎం అందరి నుంచి స్వయంగా తీసుకుని పరిశీలించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అధికారులను ఆయన ఆదేశించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విూరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయివిూ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదుపార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత నాది`కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నేతల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కష్టపడి పని చేసిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
టీడీపీని బలహీన పరచాలనుకున్న నాటి ప్రభుత్వ కుట్రలు నేతలు, కార్యకర్తల ఆత్మస్థైర్యం ముందు పని చేయలేదన్నారు. కుప్పం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. గత ఐదేళ్ల పనితీరును, ఎన్నికల్లో అవలంభించిన విధానాలపై చంద్రబాబు సవిూక్షించారు. 2029 ఎన్నికలకు ఏ ప్రణాళికతో పనిచేయాలో నేతలు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం వారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....8సార్లు నేను కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిచాను...గత ఐదేళ్లలో పాలనలో జరిగినంత హింస, దాడులు, దారుణాలు ఏనాడూ చూడలేదు. నన్ను నైతికంగా దెబ్బతీయాలని చూశారు...స్థానిక నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి, ప్రలోభాలకు గురిచేసి నాయకత్వాన్ని దెబ్బతీయాలని చూశారు.
అయినా వారి ఎత్తులు సాగలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు. నేను జిల్లా పర్యటనకు వస్తే జీవో-1 తెచ్చి రాకుండా అడ్డుకున్నారు... నిరసన తెలిపిన కార్యకర్తలపైనా అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా 10 మందిని అరెస్టు చేసి 30 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇలా ఒకటని కాదు...అన్ని విధాలుగా ప్రయత్నించి కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టాలని చూశారు. వాటన్నింటిని తట్టుకుని విూరు పని చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి నాటి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చులేదు. సామాన్య కార్యకర్తలను మంత్రులు, ఎంపీలను చేసిన చరిత్ర టీడీపీది ‘నాపై రెండు గురుతర బాధ్యతలున్నాయి.
ఒకటి కుప్పంను దేశంలోనే నెంబర్-1 నియోజకవర్గంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లడం...రెండు కుప్పంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వడం. విూరంతా ప్రజలతో మమేకమై బాగుండాలి...గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు విూరు కూడా చేయొద్దు. గత ప్రభుత్వానికి.. మన ప్రభుత్వానికి మధ్య మార్పు ప్రజలకు కనిపించాలి. మనమంతా క్రమశిక్షణ, బాధ్యతతో ఉండాలి. బాగా పని చేస్తే ఏ స్థాయి నాయకుడు అయినా.. వారి ఇంటకి వెళ్లి నేనే అభినందనలు తెలుపుతా. నా చుట్టూ తిరగకుండా పార్టీపై దృష్టి పెట్టాలి. సామాన్య కార్యకర్తలను ఎంపీలు, మంత్రులుగా చేసిన చరిత్ర మన టీడీపీకి ఉంది. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే పూచి నాది.‘ అని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.