27-06-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జూన్ 27: హరితహారం కావచ్చు, మొక్కలు నాటడం కావచ్చు. పచ్చదన్నం కావచ్చు..కార్యక్రమం ఏదైనా మొక్కలు పెంచడం, కాపాడుకోవడం ప్రజల విధి కావాలి. ఇందుకు ప్రభుత్వం కూడా గట్టిగా కృషి చేయాలి. ఇది ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని గుర్తించాలి. తాము చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది నిరంతరంగా సాగితే త్వరలోనే తెలంగాణ ఆకుపచ్చని తెలంగాణ కాగలదని అన్నారు. అయితే ప్రభుత్వంలో ఎవురు ఉన్నా లేకున్నా.. మొక్కలు పెంచడం నిరంతర ప్రకరియ కావాల్సి ఉంది. దీనిని మరింత చైతన్యవంతంగా తీసుకుని వెళితే కోతులు వాపస్ పోవడం.. వానలు వాపస్ రావడం ఖాయం కాగలదు.
జూన్ మాసాంతం వచ్చినా నేటికీ వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి వర్షాభావ వాతావరణమే కాకరణం. మొక్కలు నాటడం, పెంచడం అన్నది నిరంతర పక్రియ అని ప్రజలంతా గుర్తుంచుకోవాల్సి ఉంది. వంద శాతం పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రభుత్వంతో కలసి రావాల్సి ఉంది. ప్రతి జిల్లాను హరిత జిల్లాగా మార్చాలనీ, ఇందుకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాల్సి ఉంది. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలి. ఏ రకం మొక్కలు ఏయే ప్రదేశాల్లో నాటాలో అటవీ శాఖ అధికారులు సూచనలివ్వాలి. సరైన సమయంలోనే మొక్కలు నాటడం చేపట్టాలి. వెన్యూ ప్లాంటేషన్‌కు పండ్ల మొక్కలను సంబంధిత గ్రామప్రజలతో మాట్లాడి వారి సహాయ సహకారాలతో నాటితే కోతుల బాధ కొంతయినా పోతుంది.
ప్రభుత్వ నర్సరీల్లో మొక్కలు సరైన దశలో వృద్ధి చెందిన విూదటే నాటేందుకు చర్యలు చేపట్టాలి. అన్ని పాఠశాలల్లో పచ్చదనం ఉండేలా మొక్కలు నాటేలా విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలి. పట్టణాల్లో జంక్షన్లు, రోడ్ల సుందరీకరణకు మొక్కలు నాటాలి. అవసరాలకు ఏయే రకం మొక్కలు ఎన్ని కావాలో సర్వే చేసి తదనుగుణంగా నర్సరీల్లో మొక్కల పెంపకం చేపడితే ప్రయోజనం చేకూరుతుంది. ఈ సంవత్సరం లక్ష్యాన్ని చేరుకునే విధంగా మొక్కలను నాటాల్సి ఉంది. అధికారులు దృఢనిర్చయంతో ముందుకు సాగాలి. గతేడాది వరుణ దేవుడు కరుణించడంతో నాటిన మొక్కలు జీవం పోసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఫారెస్ట్ నర్సరీలో లక్షల్లో వివిధ రకాల మొక్కల పెంపకం, అలాగే ఈజీఎస్ కింద వివిధ రకాల మొక్కలను పెంచిపోషిస్తున్నారు.
ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తున్న కారణంగా కార్యక్రమాన్ని ఒక మహోత్తర ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాల్సి ఉంది. మొక్కలు నాటించి ఈజీఎస్ కూలీల ద్వారా నాటిన మొక్కల చుట్టూ రక్షణ కంచెలు సైతం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయాలి. కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ శాఖల ఆధ్వర్యంలో పండ్లు, పూలు, అటవీ, మిశ్రమ జాతి మొక్కలతో ఇతర మొక్కల పెంపకాన్ని చేపట్టారు. వన విభాగం కింద ఒకటి, జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం ఆధ్వర్యంలో నర్సరీలను నెలకొల్పి మొక్కల పెంపకం చేపట్టడం అవసరం.