ad1
ad1
Card image cap
Tags  

  27-06-2024       RJ

అత్యంత కఠిన నియమాలకు ప్రతీక వారాహి దీక్ష

ఆంధ్రప్రదేశ్

  • కార్యసిద్ది కోసం కఠిన నియమాలతో పూజలు
  • డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ దీక్షతో సర్వత్రా చర్చ

అమరావతి, జూన్‌ 27: డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ వేషధారణ, ఆయన ప్రచార రథంపేరు వారాహి కావడంతో ఇప్పుడు వారాహి మాత పేరు మారుమోగిపోతోంది. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆ అమ్మవారి దీక్షను చేపట్టడం కూడా ఓ కారణంగా చూడాలి. 11 రోజుల పాటు పవన్‌ వారాహి మాత దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది కూడా జూన్‌ నెలలో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మకు పూజలు నిర్వహించారు. అప్పట్లో కూడా వారాహి మాత వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ దీక్ష చేపడుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. పవన్‌ కల్యాణ్‌కు దైవభక్తి ఎక్కువే అంటారు. ఆయన అందరికి భిన్నంగా వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించటంతో ఈ ఏడాది కూడా వారాహి మాత దీక్షను కంటిన్యూ చేస్తున్నారు.

గతంలో కూడా పవన్‌ చాలా దీక్షలు చేపట్టారు. చాతుర్మాస దీక్ష చేశారు. నాలుగు నెలల పాటు ఈ దీక్షలో పవన్‌ కొనసాగారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం మాసాల్లో పవన్‌ దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో కూడా ఆహార నియమాలు పాటించారు. సాత్వికాహారం మాత్రమే తీసుకునేవారు. దీక్ష విరమించే సమయంలో హోమం కూడా నిర్వహించారు. ఇంతకీ వారాహి మాత దీక్ష ఏమి ఆశించి చేస్తారు? ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? వీటి గురించి తెలుసుకుందాం.. మనో అభీష్టాలను నెరవేర్చే వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు. జూన్‌ నెలాఖరుతో మొదలై జూలై 9 వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు ముగుస్తాయి. ఈ సమయం గురించి ఎక్కువగా ప్రచారంలో లేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. మన సంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి, శక్తిమంతమైనవి ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు. ఎవరైతే ఈ నవ రాత్రులు అత్యంత నిష్ఠతో, శ్రద్ధతో దీక్ష ఆచరిస్తారో వారి సమస్యలన్నీ అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతా యనేది పెద్దల విశ్వాసం.

సప్తమాతృకలలో వారాహి మాత ఒకరు. ఈమె లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్య క్షురాలు. మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వ మంగళ స్వరూపం. దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణకు అమ్మవారు ఆయుధాలు ధరించి ఉంటారు. చూడటానికి ఉగ్రరూపంగా కనిపించినప్పటికీ ఆమె చాలా కరుణామయి. అయితే వారాహి ఆరాధన అందరూ చేయకూడదన్న అపోహ ఉండటం వల్ల చాలా మందికి వారాహి మాత గురించి పెద్దగా తెలియదు. కానీ ఇది సత్యదూరం.ఎవరైనా వారాహి మాతను పూజించవచ్చు. 
అరిషడ్వర్గాలు అమ్మ అధీనంలో ఉంటాయి. కామ,క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుందని అనుభవజ్ఞుల మాట. మన మనస్సును నియంత్రిస్తుంది. వారాహి మాత భూదేవి నాగలిని, రోకలిని ధరించిన ధాన్య దేవత కూడా. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి రైతు వారాహి మాత ఆరాధాన చేయాలని చెబుతారు. వారాహి మాత దీక్ష శ్రద్ధతో చేసిన వారికి వారు కోరుకున్నవన్నీ జరుగుతాయి. భూ సమస్యలు పరిష్కారమవుతాయి. భూ తగాదాలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు,

జీవితంలో స్థిరత్వం లేకున్నా. మనకు రక్షణ కావాలన్నా, ఇంట్లో తరచూ అశుభాలు జరుగుతున్నా, ఆర్థిక స్థిరత్వం లేకున్నా, అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలన్నా వారాహి మాత దీక్ష చేస్తే చాలు ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కారం అయిపోతుందంటారు. వారాహి మాత దీక్ష చేపట్టేవారు రోజూ ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక దీక్షా వస్త్రాలు ధరించాలి. అలా వీలు కాని వారు మెడలో దీక్షగా ఒక కండువాను తొమ్మిది రోజుల పాటు ధరించాలి. నిత్యం వారాహి మాత అష్టోత్తర నామాలు, కానీ సహస్ర నామాలు కాని చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎర్రటి పూలతో పూజించాలి. దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టాలి. దీక్షలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు ధరించరాదు. మద్య,మాంసాలకు దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలని, నేలపైనే చాప పరిచి పడుకోవాల్సి ఉంటుందని పండితులు పూజా క్రతువును వివరించారు.  ఆచరించటానికి మాత్రం ఇది కాస్త కఠినంగానే ఉంటుంది. అయితే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఈ మాత్రం చేయగలగాలన్న ధృడచిత్తం కావాలి. మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహి మాత ధైర్యం, నిర్భయతకు గుర్తుగా చూస్తారు. వారాహి మాతను ధ్యానించడం లేదా ఆరాధించటం ద్వారా సిª`ది పొందవచ్చని అంటారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP