27-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 27: ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ) కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల్లో అభివృద్ధి ప్రణాళికల అమలుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని... సంపూర్ణతా అభియాన్‌లో భాగంగా నిర్దేశిరచిన సూచికల్లో ప్రగతిపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌లలో పురోగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశానికి కలెక్టర్ సృజన.. అధికారులతో కలిసి కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ గత అక్టోబర్‌లో 100 ఆకాంక్షిత బ్లాకులను ఎంపిక చేయగా.. ఈ జాబితాలో ఎన్‌టీఆర్ జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాంక్షిత బ్లాక్‌లలో వివిధ సూచికల్లో ప్రగతిపై నీతి ఆయోగ్ సీఈవో సూచనలు చేశారు. అదే విధంగా సంపూర్ణతా అభియాన్ కింద ఆరు సూచికల్లో ప్రగతికి అనుసరించాల్సిన ప్రణాళికపై దిశానిర్దేశర చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ సృజన క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు చేశారు.
ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల్లో 9 రంగాలు,40 సూచికల్లో ప్రగతికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడంలో సమర్థత చూపాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంపూర్ణతా అభియాన్ చొరవ కింద ప్రధానంగా గర్బిణీల రిజిస్టేష్రన్, వారికి ఆరోగ్యం పరంగా అవసరమైన సేవలు అందించడం, పోషకాహారం అందించడం హైపర్ టెన్షన్, మధుమేహం స్క్రీనింగ్, రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించడం, ఎస్‌హెచ్‌జీలకు రివాల్వింగ్ ఫండ్ సూచికలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. జులై 1 నుంచి మూడు నెలల పాటు ప్రత్యేకంగా కృషిచేసి ఈ సూచికలకు సంబంధించి 100 శాతం లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జులై 4న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి.. లోగో ఆవిష్కరణ, సెల్ఫీ స్టాండ్‌లు వంటివి ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కలెక్టర్ జి.సృజన సూచించారు. వర్చువల్ సమావేశంలో సీపీవో వై.శ్రీలత, పెనుగంచిప్రోలు ఎంపీడీవో సాయి హర్ష, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో పి.ఉమాదేవి, ఏబీపీ బ్లాక్ కోఆర్డినేటర్ మోహన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.