27-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 27: జల్జీవన్ మిషన్లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. గ్రావిూణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ఆయన గురువారం సవిూక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం.. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్జీవన్ మిషన్ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశర చేశారు.