27-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 27: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. హైదరాబాద్ శివారులో నివసించే బాలికను కానిస్టేబుల్ ప్రదీప్ ప్రేమ పేరుతో లోబర్చుకొని అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి బెదిరిస్తూ.. నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. గతేడాది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. రిమాండ్‌కి తరలించారు. అయితే మైనర్ అమ్మాయిలను బెదిరించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వారిని వాడుకుంటున్నట్లుగా బాధితులు వాపోయారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా గుర్తించారు.
తనతో పడుకోకపొతే ఆ ఫోటోలను సోషల్ విూడియాలో అప్ లోడ్ చేస్తానంటూ కానిస్టేబుల్ పలువురిని బెదిరిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు వెల్లడిరచారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ బాలికతో గత రెండు సంవత్సరాల నుండి ఎఫైర్ ఉందని.. అయితే, ఆమె గర్బం దాల్చకుండా కీచకుడు పసరు పోసినట్లుగా గుర్తించారు. పైగా బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్ కు కానిస్టేబుల్ పంపాడు. తాను పిలిచినపుడు తనతో గడపాలని బెదిరించడమే కాకుండా.. విడియోలు బయట పెడతానంటూ వేధించాడు. చేసేది ఏమి లేక ఆ బాలిక కానిస్టేబుల్‌కు లొంగి పోయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా నిందితుడు ప్రదీప్ పని చేస్తున్నాడు. 2020 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్.. రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్ పల్లిలో పని చేశాడు. అతను పని చేసిన ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఇదే వ్యవహారం నడిపాడు. ప్రదీప్ వ్యవహారం బయటకు పొక్కడంతో పై అధికారులు సీరియస్ అయ్యారు.
బుధవారం సైబరాబాద్ కమిషనర్ ను బాధితురాలి కుటుంబ సభ్యులు కలిసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటికి వచ్చింది. తమను కూడా కానిస్టేబుల్ ప్రదీప్ బెదిరించినట్లుగా బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. షీ టీమ్ సహాయంతో రాజేంద్రనగర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.