27-06-2024 RJ
సినీ స్క్రీన్
నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్"ఇండియా ప్రాజెక్ట్" స్వయంభూ మారేడుమిల్లిలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. నిఖిల్ హీరోగా 20వ చిత్రంగా పీరియాడికల్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా ఉండేలా దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ ’స్వయంభూస చిత్రాన్ని అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రను పోషిస్తుండగా ఆ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోవడం విశేషం. సంయుక్త , నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు.