28-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ, జూన్ 27: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీపీ నేతల వివరాలను లేఖ ద్వారా స్పీకర్‌కు తెలిపారు. లావు శ్రీకృష్ణ దేవరాయలును టీడీపీపీ నేతగా గుర్తించాలని కోరారు. ఇక టీడీపీపీ డిప్యూటీ లీడర్లు, కార్యదర్శి, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శుల పేర్లను కూడా లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు లేఖను స్పీకర్ ఓం బిర్లాకు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితర టీడీపీ ఎంపీలు అందజేశారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజుకి కూడా లేఖ కాపీని పంపించారు.