28-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 28: బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన గొప్ప మేధావి పీవీ నరసింహ రావు.
భూ స్వామ్య కుటుంబంలో పీవీ జన్మించారు. తనకు గల 1200 ఎకరాల్లో 1000 ఎకరాలను పేదలకు పంచారు. పీవీ నరసింహ రావు అమలు చేసిన భూ సంస్కరణలతో రైతు కూలీలకు భూమి దక్కిందని చెప్పొచ్చు. ఆంధప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఏపీ సీఎం పదవి చేపట్టి భూ సంస్కరణలను అమలు చేశారు. పదవి చేపట్టిన వన్నె తీసుకొచ్చారు. పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో గురుకుల విద్యను ప్రవేశపెట్టారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నవోదయ పాఠశాలలను ప్రారంభించారు. జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓపెన్ జైల్ అనే పద్ధతికి శ్రీకారం చుట్టారు. సీఎంగా భూ సంస్కరణలు, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు.