28-06-2024 RJ
సినీ స్క్రీన్
ప్రభాస్ హీరోగా నటించిన ’కల్కి 2898 ఏడీ’ చిత్రంపై సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్‌హిట్ టాక్ తెచ్చుకొంది. తాజాగా మెగాస్టార్, చిరంజీవి, రాజమౌళి ఈ చిత్ర బృందాన్ని సోషల్ విూడియాలో అభినందించారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేశారు. ’కల్కి గురించి అన్ని చోట్ల చక్కని స్పందన వినిపిస్తోంది. నాగ్ అశ్విను మైథాలజీ, సైంటిఫిక్ జానర్ కథను ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్, దీపికా వంటి భారీ క్యాస్టింగ్‌తో అద్భుతంగా తెరకెక్కించారు. నా అభిమాన నిర్మాతలు అశ్వినీదత్, ప్రియాంక, స్వప్నాలకు అభినందనలు. ప్యాషన్, కరేజ్‌తో టీమంతా సాధించిన సక్సెస్ ఇది. మన సినిమాలు భారతీయ జెండాను మరింత ఎత్తున రెపరెపలాడేలా చేస్తున్నాయని అన్నారు. రాజమౌళి సినిమా గురించి ట్వీట్‌లో రివ్యూ ఇచ్చారు. ’కల్కి’ మూవీలో కొత్త ప్రపంచం నిర్మాణాన్ని ఇష్టపడ్డా.
అద్బుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. డార్లింగ్ తన టైమింగ్, టాలెంట్‌తో చంపేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపిక నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది. అయితే సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తమ ఎలాన్‌ను అమలు చేయడంలో వందశాతం ప్రయత్నం సక్సెస్ సాధించారు. నాగి, అలాగే మొత్తం వైజయంతి టీమ్‌కు అభినందనలు’ అంటూ పోస్ట్ చేశారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. 1000 రెబల్ స్టార్‌లను కలిపితే అది ప్రభాసః అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐమాక్స్‌లో సినిమాను వీక్షించిన ఆమె విూడియాతో మాట్లాడారు. ఈ సినిమాని ఆదరించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స, మా కుటుంబ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ఫీట్లు మరో స్థాయిలో ఉన్నాయి. వాటి గురించి చెప్పేందుకు మాటల్లేవ్‘ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.