28-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 28: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన గవర్నర్‌కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండిరగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరి భేటీకి ముందు మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌కు స్వాగతం పలికి.. శాలువాతో సత్కరించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గవర్నర్‌కు.. విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు.