28-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 28: మొహర్రం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై శుక్రవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా మత పెద్దలతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే ఆశుర్ ఖానాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆశుర్ ఖానాల పరిసర ప్రాంతాలలో పెండిరగ్ లో ఉన్న డ్రైనేజ్, రోడ్లు మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని, అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లను ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రధాన ఏనుగు ఊరేగింపు రోజున ఊరేగింపు జరిగే మార్గాలలో విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, వాటర్ బోర్డ్ అధికారులు త్రాగు నీరు అందించాలని, జి.హెచ్.యంసి అధికారులు పారిశుథ్య పనులను పర్యవేక్షించాలని అన్నారు.
మొబైల్ టాయిలెట్స్ తదితర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొహరం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధాన ఊరేగింపు ప్రారంభం కానున్న బీబీ కాలనీ పరిసరాల ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సంతాపం తెలిపెందుకు ఆశుర్ ఖానాలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌళిక వసతులు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. వారి కోసం మినీ బస్సులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు విూర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, విూర్జా రహమత్ బేగ్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మెరాజ్, కౌసర్ మొహియుద్దీన్, విూర్ జుల్ఫెకర్ అలీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ్గªనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్, వైస్ చైర్మన్ ,ప్రెసిడెంట్ హీమ్ ఖురేషి, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉఊఓఅ కవిూషనర్ అమ్రపాలి, హైదరాబాద్ పోలీస్ కవిూషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.