28-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 28: ఎసిబి డిజిగా అతుల్ సింగ్ నియామకం అయ్యారు. సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా రవిశంకర్ అయ్యన్నార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్‌ను సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. అలాగే ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా ఉన్న అతుల్ సింగ్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. ఇక శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా నియమించింది. మరోవైపు గత వారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.