30-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 30: హైదరాబాదులోనీ కేశవ్ మెమోరియల్ కాలేజీలో నేషనల్ థింకర్స్ నిర్వహించినటువంటి నూతన చట్టాల అవగాహన సదస్సుకు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బోనగిరి పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్ నెంబర్, నేషనల్ థింకర్స్ ఆర్గనైజర్ రామారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జస్టిస్ ఐలిశెట్టి లక్ష్మీనారాయణ హైకోర్టు న్యాయమూర్తి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ప్రొఫెసర్ జేబీ రెడ్డి గారు ప్రధాన వ్యక్తిగా వచ్చారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం న్యాయవాదులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించి రాబోయేటటువంటి భారతదేశంలో నేర రహిత దేశంగా మార్చడానికి న్యాయవాదులు పోలీసులు న్యాయమూర్తులు విశేషమైన కృషి చేయాలని తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమానికి హాజరై భారతదేశం యొక్క నూతన చట్టాల పైన విశేషమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేకమంది ప్రముఖుల యొక్క సూచనలను ఉపన్యాసాలను నూతన చట్టాల యొక్క అవసరాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలనుంచి న్యాయవాదులు పాల్గొనడం జరిగింది.