ad1
ad1
Card image cap
Tags  

  01-07-2024       RJ

కొత్త ప్రభుత్వంలో పెన్షన్ల కార్యక్రమాలకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్

  • ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం
  • ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాం
  • పెనుమాకలో పెన్షన్ల పంపిణీ చేపట్టిన సిఎం చంద్రబాబు

అమరావతి, జూలై 1: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగుపడిరదని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. సోమవారం ఉదయమే ఆన నేరుగా పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్దిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. అందరి ఆశీస్సులతో నాలుగోసారి సిఎంగా ప్రమాణం చేశానన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడిరదన్నారు. సమాజమే దేవాలయం అని ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ చెప్పారనీ, ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతామన్నారు. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామన్నారు.

ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అన్నారు. దివ్యాంగులకు పింఛను రూ.6వేలు చేశామని, వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు క్లళెం వేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు, అధికారులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పింపిణీ తమ వల్ల కాదన్నారు. పంపిణీ చేతకాకపోతే ఇంటికి వెళ్లాలని వారికి ఆనాడే చెప్పానన్నారు. నేడు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతోందన్నారు. దీనికి వాలంటీర్ల సహాయం కూడా తీసుకోవాలని చెప్పామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టానన్నారు. మొదటిది మెగా డీఎస్సీ.. వీలైనంత త్వరగా టీచర్ల నియామకం చేపట్టే బాధ్యత తీసుకుంటానన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశానన్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడోది పెట్టానన్నారు. రూ.5 కే భోజనం చేయొచ్చునన్నారు.

త్వరలోనే 183 క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. నిరంతరం వారికోసం పనిచేస్తాం అని అన్నారు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ప్రభుత్వానికి సహకరించాలని చంద్రబాబు కోరారు. తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులే కనబడుతున్నాయి. గతంలో ప్రజల బతుకులను రివర్స్‌ చేశారు.. కోలుకుని మళ్లీ ముందుకు వెళ్లాలి. అందరం సమష్టిగా కలిసి పనిచేద్దాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం.. పెంచిన దాన్ని పంచుతాం. విూ అందరి అభిమానం చూరగొని లోకేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించారు. వైసిపి నేతలు ఐదేళ్ల పాటు ప్రజలను అణగదొక్కారు. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటివరకూ రూ. 1,939 కోట్లు ఖర్చు చేసేవారని.. ఇప్పుడు అదనంగా మరో రూ.819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్‌ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్టీ వాడల్లో పర్యటించానని బనావత్‌ రాములుకు వృద్దాప్య పెన్షన్‌, అయన కుమార్తె సాయికు వితంతు ఫించన్‌ రూ.7 వేలు అందించానని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకునేందుకు లక్షా 80 వేలు ఆర్థిక సాయం ఇస్తానని.. వెంటనే ఇల్లు కట్టిస్తామని హావిూ ఇచ్చానన్నారు. ప్రతి ఏడాదికి రూ. 33,100 కోట్లు పేదవారి పెన్షన్‌ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో లక్షా 65 వేల కోట్లు పెన్షన్ల కోసం కేటాయిస్తామని తెలిపారు. పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పిన హావిూని 24 రోజుల్లోనే పూర్తి చేయడం తమ కమిట్మెంట్‌ అని చెప్పారు. ఎన్టీఆర్‌ హయాంలో రూ. 35తో ప్రారంభమైన పెన్షన్‌ ఇప్పుడు రూ. 4వేలకు చేరిందన్నారు. తన ప్రభుత్వ హయాంలోనే రూ. 2,840 పెరిగిందని వెల్లడిరచారు.

గత ఐదేళ్ల పాలన ఒక పీడకల అని విమర్శించారు. ఇలా ఆనందంగా మాట్లాడుకున్న రోజులు గతంలో లేవన్నారు. గతంలో ఏపీ బ్రాండ్‌ దెబ్బతినిందని చెప్పారు. ప్రభుత్వం దివాలా తీసింది.. అప్పు ఎంతుందో తనకు, తనతోపాటు ఆఫీసర్లకు కూడా తెలియడం లేదన్నారు. పోలవరం పూర్‌ఖ్తె ఉంటే ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేవాళ్ళమన్నారు. ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అబద్దాలకోరును శాశ్వతంగా రాజీయాల నుంచి భూసమాధి చేస్తామన్నారు. ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా కాదని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్క పేదవాడి ఆదాయం పెంచి పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ఆశయం అని స్పష్టం చేశారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP