01-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం, జూలై 1: వలంటీర్లు లేకుంటే పెన్షన్లు రావని ప్రచారం చేశారని, కానీ అది అబద్దమని ఇప్పుడు తాము రుజువు చేశామని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో పెన్షన్లలో కొంత లంచానికి పోయేదని ఇప్పుడా బాధ లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సిఎవ చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగి, పెన్షన్ల పంపిణీ చేపట్టారని అన్నారు. తాను పూర్తి జీతం తీసుకుని పని చేద్దామనుకున్నానని.. కానీ పంచాయతీ రాజ్ శాఖలో నిధుల్లేవు. ఎన్ని రూ.వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని అందుకే జీతం వదిలేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
’ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరిచేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పా. దేశం కోసం నేల కోసం పని చేస్తా అని స్పష్టం చేశారు. మన పిల్లల భవిష్యత్ కోసం పని చేద్దామని, తను నిజాయితీగా పని చేస్తాని హావిూ ఇచ్చారు. ఇకపోతే వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు అందజేసారు. పవన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి గొల్లప్రోలుకు బయలుదేరి వచ్చారు.
భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. వందలకోట్ల రూపాయలతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయి. గతంలో జల్జీవన్ మిషన్ నిధులున్నా ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు.
క్యాంపు ఆఫీస్లో మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏవిూ చేయొద్దని చెప్పా. అవసరమైతే కొత్త ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానని తెలిపాను. సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు మనస్కరించలేదు. జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నా.. కానీ పంచాయతీ రాజ్ శాఖలో నిధుల్లేవు. ఎన్ని వేలకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరిచేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పా. దేశం కోసం, నేల కోసం పనిచేస్తున్నానని తెలిపాను. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభను వెలికితీయాలి.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే నేనున్నా. విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేను. గెలిచినందుకు ఆనందం లేదు.. పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం. పిఠాపురాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. కాలుష్యం లేని పరిశ్రమలు ఇక్కడికి రావాలి. విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలి. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో నాకు లేదు. ప్రజల్లో నాకు సుస్థిర స్థానం కావాలి. అన్ని పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పని చేస్తాం. పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు.. ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని పవన్ అన్నారు. ఒక తరం కాదు..రెండు తరాల కోసం పనిచేయాలి. వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలని అన్నారు.