ad1
ad1
Card image cap
Tags  

  02-07-2024       RJ

ఎబివిపి సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం ముట్టడి

తెలంగాణ

  • టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి 
  • విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌, జూలై 2: టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిరది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిరచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేశారు. టీచర్‌ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 పిలువాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ కార్యదర్శి రaాన్సీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్‌ రెడ్డి హావిూ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్‌-2, 3తోపాటు ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఒక్కొక్కరిగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని  ఏబీవీపీ విద్యార్థులు  ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడిరచేందుకు ఏబీవీపీ యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్‌ చేస్తోంది. అలాగే గ్రూప్‌ 2 పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. తక్షణమే మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ నినాదాలు చేసారు. ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఏబీవీపీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గత తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మోతీలాల్‌నాయక్‌  దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని మోతీలాల్‌ నాయక్‌ చెప్పారు.

కేసీఆర్‌ 9 రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది కానీ.. తాను దీక్ష చేస్తే ఒక్క ఉద్యోగం కూడా పెరుగలేద న్నారు. ఇతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ’ఇన్నిరోజులు అన్నపానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశా. తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్‌ లెవల్స్‌ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, కరెంటు వచ్చినయ్‌. 25 నుంచి 35 ఏండ్ల వయస్సు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలే. ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యోగులపై లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదు. మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?. నా ఫోన్‌ లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయడం లేదు. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయాలి. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP