02-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 2: కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ఏడు నెలల నుంచి గ్రామపంచాయతీలకు ఏడు పైసలు కూడా విడుదల చేయలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం నిలిచిపోయింది. మలేరియా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు బాధపడుతున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం గత సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి తెచ్చి ప్లలెలను అద్దాల్లా మార్చారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించారు. గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్ఛత లక్ష్యంగా బీఆర్‌ఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. వర్షాకాలం ప్రారంభమంలో స్పెషల్ డ్రైవ్, మార్చి నెలలో మరో డ్రైవ్ చేసేవాళ్లం. దాంతో వైరల్ ఫీవర్స్‌ను అరికట్టగలిగాం.. అభివృద్ధి కూడా జరిగింది అని హరీశ్‌రావు తెలిపారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. ఏడు నెలల కాలంలో ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ప్లలె ప్రగతి కింద ప్రతి ప్లలెకు జనాభా ప్రతిపాదన నిధులు ఇచ్చాం. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చాం. కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ ప్లలెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి నెలలు గడుస్తుంది. ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఈ నెల 4న జిల్లాల పరిషత్‌ల పదవీకాలం ముగియనుంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని హరీశ్‌రావు మండిపడ్డారు. పరిశుభ్రంగా ఉంచాల్సిన పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారు అని హరీశ్‌రావు నిలదీశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ గ్రామపంచాయతీల్లో చెత్త సేకరణకు కేవలం 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12,769 పంచాయతీల్లో 12,769 ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది. కేంద్రం గ్రామపంచాయతీలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ ప్లలెలు లేకుండా అవార్డులు లేవు. తెలంగాణ ప్లలెలు, మండలాలు,జిల్లాలు ఉత్తమంగా నిలిచాయి. కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీ లు కూనరిల్లుతున్నాయి. ప్లలెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఉంది. మురికి కూపాలుగా మారుతున్నాయి. డీజీల్ పోయించుకునే పరిస్థితి లేదు. ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. ఇది ఇవాళ పరిస్థితి. కొన్ని చోట్ల పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి డిజీల్ పోయిస్తున్నారు. నా నియోజకవర్గానికి నిన్న వెళ్లాను.. స్పష్టంగా అధికారులతో మాట్లాడిన తర్వాతనే మాట్లాడుతున్నాను. కరెంట్ బిల్లులు కట్టేందుకు కూడా గ్రామపంచాయతీల వద్ద డబ్బుల్లేవు.
కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ బిల్లులు సయమానికి కట్టేవారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు డబ్బులు, పారిశుధ్య కార్మికులు వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు పాలనా అస్తవ్యస్తంగా తయారైంది అని హరీశ్‌రావు మండిపడ్డారు. పంచాయతీల్లో డబ్బుల్లేక చెత్త పేరుకుపోయింది. స్పెషల్ డ్రైవ్ లేదు. ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ప్రజా ప్రభుత్వంలో పారిశుద్ధ కార్మికులకు స్థానం లేదా..? ఒకటో తారీఖున జీతాలు ఇవ్వారా..? అంటురోగాల బారిన పడితే ఎలా..? ప్లలెల విూద సవిూక్ష ఎందుకు చేయట్లేదు. చివరకు సర్పంచ్‌లు పోయి గవర్నర్‌కు మొర పెట్టుకునే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. వేతనాలు అందక కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ నీళ్లల్లో కలపాలి. గడ్డి మందు లేదు. అస్తవ్యస్తం అయిపోయింది ప్రజా పాలన. ప్లలెలను ఎందుకు గాలికి వదిలేశారు అని హరీశ్‌రావు నిలదీశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతికి నెలకు రూ. 275 కోట్లు, ఏడాదికి రూ. 3,330 కోట్లు ఖర్చు పెట్టామని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ నిధులన్నింటిని పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు కేటాయించలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలకు ఏడాదికి రూ. 1700 కోట్లు ఇచ్చాం. విూరు వచ్చి ఏడు నెలలు అయినా ఏడు పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా..? మలేరియా, డెంగీ వంటి వైరల్ ఫివర్ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు..? బీఆర్‌ఎస్ హయాంలో ప్లలె ప్రగతి, పట్టణ ప్రగతికి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేశాం. దాదాపు ఈ రెండిరటికి గత ఐదేండ్లలో రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్‌ఎస్. ఏడు నెలల కాలంలో 20 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ గవర్నమెంట్.
ఇది బీఆర్‌ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా.. అని హరీశ్‌రావు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కూడా ఏడు నెలలుగా జీతాలు అందడం లేదు. తక్షణమే పారిశుధ్య కార్మికులతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పోకడ. పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అడడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక కొత్త పోస్టును క్రియేట్ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్లలెల అభివృద్ధి కోసం వారి సేవలను వినియోగించుకున్నాం. ఇప్పుడు ఆ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పల్లెలను గాడిన పెట్టండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్‌రావు సూచించారు.