02-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కాకినాడ, జూలై 2: కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. కాకినాడ గుడారిగుంటలో ద్వారంపూడి ప్రధాన అనుచరుడైన బల్లా సూరిబాబు రెండు అంతస్తుల భవనం నిర్మించారు. అనుమతి లేకుండా ఈ నిర్మాణం చేపట్టినట్లు నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించి అక్కడికి వచ్చారు. దీంతో పోలీసులు, అధికారులు.. ద్వారంపూడి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ద్వారంపూడి కూడా ఘటనా స్థలికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టౌన్ ప్లానింగ్ అధికారి, మాజీ ఎమ్మెల్యే కాసేపు చర్చలు జరిపారు.
అనంతరం అక్కడి నుంచి ద్వారంపూడి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బల్లారి సూరిబాబు.. తెదేపా నాయకులను తీవ్రమైన పదజాలంతో దూషించారు. వచ్చేది మా ప్రభుత్వమే అంతు చూస్తానంటూ వీరంగం వేశారు. స్పెషల్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ద్వారంపూడి అనుచరులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం టౌన్‌ఎª`లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణం కూల్చివేత పక్రియను చేపట్టారు.