02-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 2: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చేపట్టే దిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్టు సమాచారం. విభజన హావిూల అమలుపైనా చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీయే నేతలతో చంద్రబాబు చర్చించనున్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం వెళతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెండిరగ్ ప్రాజెక్టులు, తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీయే నాయకులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. గత ఐదేళ్లలో పెండిరగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. రాష్టాన్రికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద చంద్రబాబు ప్రస్తావించనున్నారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టడంపై సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత ప్రభుత్వ పాలన వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర పురోగతి కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అంశాలపై ఫోకస్ చేస్తున్నారు.