03-07-2024 RJ
సినీ స్క్రీన్
రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ’డబుల్ ఇస్మార్ట్’లో నటిస్తున్నారు. ఇది 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ను అందుకున్న ’ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్. ఈ సినిమాలో హీరోయిన్‌గా కావ్య థాపర్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, చార్మి కౌర్ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ అందరికీ మంచి కిక్ ఇచ్చి.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. సోమవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను ’మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ’స్టెప్పామార్’ అంటూ సాగే ఈ పాట హై ఎనర్జిటిక్ మాస్ మూమెంట్స్‌తో సాగింది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, సాహితీ ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌కు మణిశర్మ సంగీతం అందించారు.