ad1
ad1
Card image cap
Tags  

  03-07-2024       RJ

విభజన చట్టంలో.. విలీన మండలాలు లేవు

తెలంగాణ

  • కుట్రపూరితంగా బిజెపి, బిఆర్‌ఎస్‌ ఎపిలో కలిపాయి
  • ఈ మండలాల కోసం బిఆర్‌ఎస్‌ ఏనాడు పోరాడలేదు
  • విలీన మండలాల కోసం హరీష్‌ రావు దీక్ష చేయాలి
  • రైతు రుణమాఫీపై ప్రశ్నించే అధికారం బిఆర్‌ఎస్‌కు లేదు 
  • అధిష్టానం ఆదేశాలతో మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్‌ నియామకం
  • మీడియా సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, జూలై 3: ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడానికి కారణం బీఆర్‌ఎస్సేనని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం అంశం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాతే ఏడు మండలాలు ఏపీలో కలిపారని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్‌ దీక్ష చేయాలన్నారు. హరీశ్‌ రావు టైంపాస్‌ మాటలు బంద్‌ చేయాలని కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ చేసిన తప్పులు చెయ్యబోమని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఏడు మండలాలను తిరిగి రప్పించే విషయంలో ఏనాడూ కెసిఆర్‌ కొట్లాడలేదని అన్నారు. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్‌ఎస్‌, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్‌ దీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ విభజన సమయంలో ఈ అంశాలను తేలేదన్నారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. కేబినెట్‌ విస్తరణపై పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్‌ విషయంలో కసరత్తు కొనసాగుతుందన్నారు. త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని వెల్లడించారు. పదిహేనేండ్లు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్‌వి కల్లిబొల్లి కబుర్లే అంటూ విమర్శించారు. ఏపీలో కలిపిని ఏడు మండలాలను వెనక్కి తీసుకొచ్చిన తర్వాతే ఇతర విభజన  సమస్యలపై ముందుకెళ్లాలని..దిగువ సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కేలా చూడాలిని హరీశ్‌ రావు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. పుట్టింది బతకడానికి... చావడానికి కాదని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

భూ వివాదం కారణంగా  ఆత్మహత్య చేసుకున్న రైతుకు న్యాయం చేస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యకు కారణమైన ఎవర్నీ వదిలిపెట్టబోమన్నారు. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. హరీష్‌ రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్‌ తప్పిదాలు ఆయన్ని వెంటాడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆపాలన్నారు. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.  గత సర్కార్‌ లక్ష కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రుణమాఫీపై మాటతప్పేది లేదన్నారు. తాము  ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసాపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హావిూని అమలు  చేస్తామని చెప్పారు. ప్రజలు కట్టిన ప్రతీ పైసా రాష్టాభ్రివృద్దికే ఉపయోగిస్తామన్నారు. త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన భారాస నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని  ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హావిూలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. రైతు భరోసా మొత్తంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రజలు కట్టిన పన్నులు ఎక్కడా వృథాగా పోకూడదనే ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తాం. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధివిధానాల ఖరారు ఉంటుంది. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే మా ఆలోచన. రైతులు, పన్ను చెల్లింపుదారులు, విూడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటాం అని భట్టి తెలిపారు. ఇకపోతే తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్‌ విూడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్‌ చాలాసార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్‌ తెలంగాణ సీఎం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు, రేవంత్‌ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండిరగ్‌ సమస్యలను ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP