03-07-2024 RJ
తెలంగాణ
సిద్దిపేట, జూలై 3: రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిషత్ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. 5 సంవత్సరాలు ఎంపిటిసి గా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారని చెప్పారు. మళ్లీ అందరూ ప్రజా ప్రతినిధులుగా రావాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశం మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు, బాధ్యతలు హరింపబడ్డాయని తెలిపారు. పనుల కోసమో, నిధుల కోసమే గవర్నర్ ని కూడా కలిసే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఎందుకు ఇలా జరిగిందనే మననం చేసుకునే పరిస్థితి ఏర్పడిరదన్నారు.
ఎన్నికల్లో మనం పని చేసిన దానికి అది నిదర్శనంగా ఉంటుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే విూకు గౌరవం దక్కేలా తన పని తీరు ఉంటుందని తెలిపారు. ఎండాకాలంలో ఎక్కడ నీటి సమస్య ఉండొద్దని మూడున్నర కోట్లు శాంక్షన్ అయ్యేలా చేశానని చెప్పారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంపీపీ, ఎంపీటీసీలకు అభినందనలని వారు మళ్ళీ రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పారు మంత్రి పొన్నం.