03-07-2024 RJ
సినీ స్క్రీన్
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సినిమా వేడుకలో ఆ సంకేతాలిచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో మోక్షజ్ఞ తెర ప్రవేశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందులో ’హను`మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి బాలకృష్ణ ఎవరి కథకు పచ్చజెండా ఊపుతారు? మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో తెరకు పరిచయం అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.