03-07-2024 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలు జరుపుకుంటుండగా.. మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికలుగా విూనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్బంగా విూనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్‌ల ఫస్ట్ లుక్‌లను పంచుకుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ వెంకటేశ్ భార్యగా నటించనున్నట్లు తెలుస్తుంది.