04-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 4: ఎపిలో ప్రభుత్వం మారినా..ఐదేళ్ల నాటి పాపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా అప్పులకుప్పలను తీర్చేదెలా అన్నదే చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాల్. ఇటీవలి ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్‌లో నవశకం ప్రారంభమైందని మనమంతా సంబరాలు చేసుకుంటున్నా.. కానరని భయం ఒకటి వెన్నాడుతూనే ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం సుమారు 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉంది. దీనికితోడు ఎన్నికల ముందు గత ప్రభుత్వం సంక్షేమం పేరిట అమలు చేసిన పథకాలు, వాటికి అదనంగా చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మరింత భారీ స్థాయిలో అప్పులు చేయాలి. లేదా ఆదాయ మార్గాలను వెతికి పట్టుకోవాలి. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు ప్రధాని మోడీ ఏ మేరకు హావిూ ఇస్తారన్నది కూడా ముఖ్యమే. అలాగే పోలవరం పూర్తిచేయించడం, అమరావతిని నిర్మించడం అంత సులువైన పనికూడా కాదు. కాకుంటే చంద్రబాబు సమర్థతపైనే ప్రజల్లో నమ్మకం ఉంది. ప్రస్తుత అప్పుల కారణంగా రాబోయే ఐదేళ్లలో ఋణాల భారం తగ్గకపోగా, మరింత పెరిగి 20 లక్షల కోట్లు దాటవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇంత భారీ ఋణాల భారాన్ని మోసే ప్రభుత్వం ప్రజలు, పరిశ్రమలు, వ్యాపారవేత్తలపై పన్నులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిరదనే చెప్పాలి. లేకపోతే పారిశ్రామికంగా రాష్ట్రం పురోగమించే అవకాశాలు ఉండవు. ప్రస్తుత ఆర్థిక దుస్థితిని అధిగమించాలంటే ఆదాయాలు పెంచే మార్గాలను అన్వేషించ డంతో పాటు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. వీలైన మేరకు వివిధ స్థాయిల్లో పొదుపు పాటించడం అవసరం. ఇది ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారుల నుంచి ప్రారంభం కావాలి. గత ప్రభుత్వ నేతలు, అధికారులు జరిపిన ఘోర అవినీతి, అక్రమాలను తేటతెల్లం చేస్తూ, ఆ పాలన నుంచి తమ కొత్త ప్రభుత్వానికి అందిన కష్టనష్టాలను శాఖల వారీగా వివరిస్తూ శ్వేతప్రతాలను విడుదల చేస్తూనే.. ఎక్కడెక్కడ ఖర్చులు తగగ్గించుకోవచ్చో చెప్పాలి. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్‌లా జీతభత్యాలు లేకుండ ఆపనిచేయాలి. కేంద్రంలో పలుకుబడి ఉన్నందున పెండిరగ్ ప్రాజెక్టులకు నిధులు రాబట్టాలి. ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండేల ఆచేసుకోవాలి. అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు స్వచ్ఛందంగా తమ సౌకర్యాలను తగ్గించుకోవాలి. మంత్రులు కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను వీలైనంత తగ్గించుకోవాలి. కేంద్రీకృత వాహన వ్యవస్థను జాయింట్ కలెక్టర్ స్థాయి, డివిజన్ స్థాయిలో ఆర్డీవో వంటి అధికారుల నేతృత్వంలోకి తేవాలి.
ఉపాధిహావిూ కింద పనులు వివిరివిగా చేపట్టాలి. కిలో రూపాయి బియ్యం వృధాను అరికట్టాలి. బియ్యం ధరలను పెంచాలి. సబ్సిడీ బియ్యం వల్ల స్మగ్లర్లు, అవినీతి అధికారులు మాత్రమే కుబేరులయ్యారు. చాలామంది లబ్దిదారులు ఈ బియ్యాన్ని వినియోగించడంలేదు. అలాగే అన్న క్యాంటీన్లలో పదార్థాలు, భోజనం ధరలను ఖర్చులకు అనుగుణంగా హేతుబద్ధీకరించాలి. వీటితో చాలావరకు ఆర్థిక భారం తగ్గుతుంది.అవినీతి నిరోధక శాఖ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలను బలోపేతం చేసి, ఇప్పటివరకు అవినీతి నేతలు, అధికారులు, భూకబ్జాదారులు, పన్ను ఎగవేతదారులు దిగమింగిన ప్రజాధనాన్ని, దాచిన ఆస్తులను త్వరగా స్వాధీనం చేసుకునేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి.అద్దె భవనాలకు చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు ఆదా చేసుకోవాలి. ప్రస్తుత నిర్మాణాలన్నీ పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులను చేపట్టకూడదు. పోలవరం ప్రాజెక్టును, దాని అనుబంధ కాల్వల వ్యవస్థను వేగంగా పూర్తి చేయగలిగితే, రైతుల ఆదాయాలు, వారి ద్రవ్య వినియోగశక్తి పెరిగి వివిధ పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. పోలవరానికి అదనపు నిధులు, ప్రత్యేక హోదా వంటివి పొందడానికి అవకాశం ఉపయోగించుకోవాలి. ఇలా కేంద్రంలో నిధులు పొందుతూ పొదుపు పాటిస్తూ, ఉచిత పథకాలపై ఆంక్షల విధించుకుంటే తప్ప ముందుకు సాగడం కష్టం.