ad1
ad1
Card image cap
Tags  

  04-07-2024       RJ

అర్థరాత్రి కృష్ణానది కరకట్టపై దస్త్రాల దగ్ధం

ఆంధ్రప్రదేశ్

  • విచారణకు ప్రభుత్వం ఆదేశం
  • దస్త్రాల దగ్ధంపై ఆరా తీసిన డిప్యూటి సిఎం 

అమరావతి, జూలై 4: కృష్ణానది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగులబెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతోపాటు కంప్యూటర్‌ హార్డు డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మరో వైపు పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని పవన్‌ ఆరా తీసినట్టు సమాచారం. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని ఆదేశించారు.

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ16 ఈఎఫ్‌ 2596 నంబరు గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్ట పైకి వచ్చారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సవిూపంలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ తెదేపా కార్యకర్త దీన్ని గమనించారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్‌ సవిూర్‌శర్మ చిత్రాలు ఉండడంతో ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, తెదేపా నేతలకు సమాచారం అందించారు. పీసీబీ ఫైల్స్‌, రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌  ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్‌, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్‌, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని సూచించారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్‌, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయని ప్రశ్నించారు. భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడిరచాలని ఆధికారులను డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశించారు. బుధవారం రాత్రి యనమలకుదురు కట్ట విూద పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మైనింగ్‌ శాఖకు చెందిన ఫైళ్లను సిబ్బంది దగ్ధం చేసిన విషయం తెలిసిందే. మైనింగ్‌ శాఖకు చెందిన అనేక పత్రాలు, హార్డ్‌ డిస్క్‌, క్యాసెట్‌లు దగ్ధమయ్యాయి. ఈ కేసు విచారణలో వేగం పెంచిన పోలీసులు ఇప్పటికే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఓఎస్‌డీ రామారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏయే డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌ల్లో ఏమున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే దగ్ధం చేసిన ్గªల్స్‌ అన్నీ పనికి రానివని రామారావు చెబుతున్నాడు. మరికొందరు ఉన్నతాధికారులను కూడా పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకర్ని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మాజీ చైర్మన్‌ సవిూర్‌ శర్మ కారు డ్రైవర్‌ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. మైనింగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేసేందుకు డ్రైవర్‌ నాగరాజు ప్రయత్నించారు.

రామారావు అనే యువకుడితో కలిసి కారులో యనమలకుదురు కట్ట వద్దకు వచ్చిన నాగరాజు.. బస్తాల్లో తీసుకొచ్చిన రికార్డులను తగులబెట్టాడు. ఇది గమనించిన స్థానికులు అనుమానంతో వారిని నిలదీశారు. దీంతో భయపడిపోయిన నాగరాజు, రామారావు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఈ ఘటనలో మైనింగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన పలు పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు, లెటర్‌ హెడ్స్‌, క్యాసెట్స్‌ దగ్ధమయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పెనమలూరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పీసీబీ మాజీ చైర్మన్‌ సవిూర్‌ శర్మ ఆదేశాల మేరకే తాను పత్రాలు తగులబెట్టినట్లు నాగరాజు వెల్లడిరచినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ్గªల్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు తగులబెట్టారు? అనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడిరచారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP