ad1
ad1
Card image cap
Tags  

  04-07-2024       RJ

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక విభాగం.. యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్

  • ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు
  • వందరోజుల ప్రణాళికతో ముందుకు
  • తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు
  • లోతుగా చర్చించిన కేబినేట్‌ సబ్‌కమిటీ
  • నిర్మూలనకు కఠినంగా వ్యవహరిస్తామన్న హోంమంత్రి అనిత

అమరావతి, జూలై 4: గంజాయి కట్టడికి కఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఠిన చర్యలకు దిగుతోంది. గంజాయి నివారణపై ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ గురువారం సమావేశమై చర్చించింది.. బోర్డర్లల్లో చెక్‌ పోస్టులను పటిష్టం చేయాలని అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. గంజాయి సాగుని అరికట్టేలా చర్యలు చేపట్టాలని మంత్రులు అన్నారు. గంజాయి సాగు చేసే పేదలు, గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కేబినెట్‌ సబ్‌ కమిటీ.. ఇగంజాయి సాగు చేయాలని గిరిజనులను కొందరు ప్రోత్సహిస్తున్నారని మంత్రి అనిత మండిపడ్డారు.. పేద గిరిజనులు కాఫీ సాగు వైపు కాకుండా.. గంజాయి సాగు వైపు మళ్లించేలా కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. గత ప్రభుత్వం సెబ్‌ ఏర్పాటు చేసినా గంజాయితో పాటు ఇసుక, ఎర్ర చందనం అక్రమ రవాణ బాధ్యతలు కూడా సెబ్‌ కే కేటాయించారని ఆరోపించారు.అయితే, గంజాయి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు మంత్రి అనిత.. యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తాం అన్నారు.

ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తామని.. గంజాయి కట్టడికి.. ఫిర్యాదులు చేయడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయికి బాధితులకు డి`ఎడిక్షన్‌ సెంటర్లపై ఫోకస్‌ పెడతాం. సరైన ఉపాధి, విద్యా సౌకర్యం లేకపోవడం వల్ల గిరిజన యువత పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం గిరిజనులే గంజాయి క్యారియర్లుగా ఉన్నారు. జైళ్లల్లో 15 ఏళ్ల నుంచి గంజాయి రవాణా చేసిన గిరిజన యువకులు ఉన్నారు. గంజాయిని ప్రొత్సహిస్తోన్న కింగ్‌ పిన్ల విూద ఫోకస్‌ పెడతాం అని హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయిని వీలైనంత వరకు కట్టడి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తాం. గంజాయిని అరికట్టేలా పొరుగు రాష్టాల్ర సీఎంలతో మాట్లాడేందుకు కార్యాచరణ సిద్దమవుతాం అన్నారు. కరోనా ఉన్న రెండేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం గంజాయి కట్టడిని పూర్తిగా వదిలేసిందని విమర్శించారు.. ఏడేళ్ల బాలుడు కూడా గంజాయి వినియోగించే పరిస్థితి.. అందుకే మేం సీరియస్‌ గా తీసుకున్నాం. డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇంటర్నల్‌ ఇంటెలిజెన్స్‌ పెట్టుకుంటాం.

గంజాయి సాగు విషయంలో ఏ పార్టీ వాళ్లు ఉన్నా ఊపేక్షించం.. కఠిన చర్యలు ఉంటాయి. గంజాయిపై ప్రభుత్వం యుద్దం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత  వెల్లడిరచారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో గంజాయి నియంత్రణకు ఏర్పాటుచేసిన ఉపసంఘం సమావేశం అయ్యింది. మంత్రులు అనిత, సంధ్యారాణి, లోకేశ్‌ తదితరులు, అధికారులు చర్చించారు. గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి అనిత విూడియాతో మాట్లాడారు. ఇదివరకు స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు అనేక బాధ్యతలు అప్పగించడం వల్ల గంజాయిపై ప్రత్యేక దృష్టిని సారించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్‌  టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించిందని వెల్లడిరచారు. ఇందులో రాష్ట్రస్థాయిలో ఐజీ స్థాయి అధికారిని, జిల్లా స్థాయిలో ఎస్పీని నియమించి వారికి ప్రత్యేక సిబ్బందిని అందజేసి పదిరోజుల్లో కార్యచరణ ప్రారంభిస్తామని అన్నారు.

ప్రస్తుతం గంజాయి నిర్మూలనకు జిల్లా స్థాయిలో ఉన్న టోల్‌ ఫ్రీలు  కాకుండా రాష్ట్రస్థాయిలో ఒకే టోల్‌ ఫ్రీ నంబర్‌ను వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. గంజాయి విక్రయిస్తున్న వారినే కాకుండా సరఫరా చేస్తున్న వారిపై , సాగు చేస్తున్న వారిపై దృష్టిని సారిస్తామని ఆమె అన్నారు. గంజాయి నిర్మూలనకు వందరోజుల పాక్షిక ప్రణాళిక, రెండు సంవత్సరాల్లో పూర్తిగా నిర్మూలనకు లాంగ్‌ టర్మ్‌ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గంజాయి నిర్మూలన సామాజక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ నిర్మూలన కంటే నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP