04-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 4: చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హావిూలు ఇచ్చారని, ఈ నేపధ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో జిల్లా మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి సుధీర్ఘంగా ఆరు గంటలపాటు సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, ఐఆర్‌ఆర్ భూసేకరణ, ఓఆర్‌ఆర్ అలైన్ మెంట్, వరంగల్ మాస్టర్ ఎª`లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కుడా మాస్టర్ ప్లాన్, కాళోజీ కళాక్షేత్రం, జిడబ్ల్యుఎంసి పరిధిలో రిటైనింగ్ వాల్ ల నిర్మాణం, వరద నివారణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మాణం, కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు, నర్సంపేట్ మెడికల్ కాలేజీ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్ద నగరమని ఈ నగరాన్ని, హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి పరిచేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. 2050 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ఎª`లాన్ ను తయారు చేయాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. ఈ మాస్టర్ ఫార్మా సిటి, ఐటిధ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకొ టూరిజం, ఎడ్యుకేషనల్ ఇన్ట్సిట్యూషన్స్, స్టేడియం, ఎయిర్ పోర్టు, లాజిస్టిక్స్ పార్కు, టూరిజం, ఖమ్మం, వరంగల్ రహదారిలో, కరీంనగర్-వరంగల్ రహదారిలో డంపింగ్ యార్డుల ఏర్పాటు వంటి అంశాలు ప్రధానంగా ఉండేలా మాస్టర్ అలాట్ ను వీలైనంత త్వరగా తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టు కు సంబంధించిన డీపీఆర్ లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశిరచిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడబోమని హెచ్చరించారు. వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, అలాగే ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కాళోజీ జన్మదిన సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని అప్పటివరకు పెండిరగ్ పనులను పూర్తి చేయాలన్నారు. నర్సంపేటలోని మెడికల్ కాలేజీ కార్యకలాపాలు ఈ ఏడాది నుంచి ప్రారంభించడానికి ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా చొంగ్తు ని ఆదేశించారు.వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాజీపేట్ అయోధ్యాపురం ఆర్‌ఓబీ నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏండ్లు గడిచినా ఇంకా డ్రాయింగ్ ల దగ్గరే ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వరంగల్ నగరం వరద ముప్పుకి గురి కాకుండా, వరద నీరు సాఫీగా వెళ్లడానికి నాలాలను విస్తరించాలని ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బలోపేతం చేయాలని ఇందుకు అవసరమైన సిబ్బందిని రెవెన్యూ శాఖ నుండి సమకూరుస్తామని తెలిపారు. నాలాలు, చెరువులు ఆక్రమణకు గురి కావడం వల్లే తరచూ వరంగల్ నగరం వరద ముప్పుకు గురవుతుందన్నారు.
ఈ నాలాలు అక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ నాలాలను ఆక్రమించుకుని అక్కడ నివాసం ఉంటున్న వారిని తక్షణమే మరో ప్రాంతానికి తరలించాలని ఈ సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి పేదప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలను ఇవ్వాలని అన్నారు. కొత్తగా నాలాలు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా గ్రావిూణ ప్రాంతాలలో పేద ప్రజలకు వైద్య సేవలు అందేలా డాక్టర్లను అందుబాటులో ఉంచాలన్నారు. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ లో గతంలో కంటే వసతులను మెరుగుపరచాలను వైద్య అధికారులను సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, శాసన సభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, కె.నాగరాజు, శాసనమండలి సభ్యులు బండ ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా చొంగ్తు, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, సీడీఎంఏ విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్ లు డాక్టర్ సత్య శారదా, పి. ప్రావీణ్య, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే, సంబంధిత శాఖల ఉన్నత అధికారులు అధికారులు పాల్గొన్నారు.