ad1
ad1
Card image cap
Tags  

  05-07-2024       RJ

కృష్ణా, గోదావరి జలాలపై అధ్యయనం చేయాలి

ఆంధ్రప్రదేశ్

  • వృధాగా సముద్రంలోకి నీరు వెళ్లకుండా చూడాలి
  • అప్పుడూ ఇరు తెలుగు రాష్ట్రాలకు ప్రయజనం

విజయవాడ, జూలై 5: ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధానంగా పెండిరగ్‌లో ఉన్న అతిపెద్ద సమస్యల జల వివాదం. జలాల పంపిణీపై స్పష్టత లేకుండా పోయింది. కేంద్రం కూడా నాన్చివేత ధోరణి అవలంబించింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యులన్‌ కూడా ఎటూ తేల్చలేదు. దీంతో రాయలసవిూ, దక్షిణ తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కృష్ణా జలాల అంశంలో దక్షిణ తెలంగాణ, రాయలసీమ వాసుల పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాలు బాగా పడి కృష్ణమ్మ పొంగుతున్నా వాటిని ఉపయోగించుకనే పరిస్థితి లేకుండా పోయింది. వృధా నీటిని సముద్రంలోకి పంపడం ద్వారా నోరెళ్లబెడుతున్నాము. జల జగడాలకు సంబంధించి ఇరువురు సిఎంలు  ముందుగా ఈ అంశం పరిగణనలోకి తీసుకోవాలి. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ, రాయలసీమలోనూ పెండింగ్‌ ప్రాజెక్టులు గాని కొత్త ప్రాజెక్టులు గాని పట్టాలెక్కాలంటే ట్రిబ్యునల్‌ తీర్పులతో ఇప్పట్లో సాధ్యం కాదు, ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో రాజీపడి వ్యవహరిస్తేనే అది సాధ్యమవుతుంది.

వాస్తవంలో నీటి లభ్యత ఎంత అనేది ముందుగా అంచనాకు రావాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నపుడు లేక తక్కువగా ఉన్నపుడు ఆ మేరకు ఇరు రాష్ట్రాల వాడుకోవాలన్న  ప్రతిపాదనలు సిద్దం చేసుకోవాలి. అప్పుడే  గొంతెండిపోతున్న దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటు నిత్య క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమకు నీటి సమస్య తీరగలదు. పాలమూరులో  చేపట్టిన పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల్లో బ్రేక్‌ పడిరది. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రధానమంత్రిని కలిసినపుడు పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోరారు. నీటి కేటాయింపులు జరిగితే తప్ప ఆ ప్రాజెక్టు ముందుకు సాగదు. ఆంధ్రప్రదేశ్‌ సహకరిస్తే గాని ఇది సాధ్యం కాదు. మరోవైపు ఆంధప్రదేశ్‌కు చెందిన కెసి కెనాల్‌కు నీటి కేటాయింపులు ఉన్నాయి. 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు గల ఈ పథకానికి కేవలం 1.25 టియంసిలు నీటి సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ ఒక్కటే దిక్కు.

20 టియంసిల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మించాలంటే తెలంగాణ భూభాగం లో ముంపు వస్తుంది. తెలంగాణ అనుమతి ఇస్తేనే ముందుకు సాగుతుంది. రెండు రాష్టాల్రకు ఉపకరించే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం జరగాలన్నా తెలంగాణ ఆమోదం తప్పనిసరి. ఇలా పరస్పరం పీటముడి వేసుకున్న సమస్యలు ఇందులో ఉన్నాయి. శ్రీశైలం జలాశయానికి 2040 టియంసిల జలాలు వస్తే, 1330 టియంసిల నీళ్లు సముద్రం పాలయ్యాయి. రెండు రాష్ట్రాలు సఖ్యతగా ఉండివుంటే బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు నికర జలాలు 811 టియంసిలు పోగా, క్యారీ ఓవర్‌ కింద అనుమతించిన 150 టియంసిలు శ్రీశైలం, సాగర్‌ జలాశయాల్లో నిల్వ చేసుకొని ఉండవచ్చు. అదే జరిగివుంటే 2024 వేసవిలో హైదరాబాద్‌ జంటనగరాల తాగునీటి కోసం సాగర్‌ నుండి ఎత్తిపోతలు తప్పేవి.  ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు ఈ సంక్షోభం కొనసాగకుండా తెరదించవలసిన కర్తవ్యం ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి విూద ఉంది.

రాజకీయ ప్రయోజనాలు విస్మరించి, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరితేనే ప్రయోజనం ఉంటుంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగిందనే వాదన ఉంది. అయితే ఈ అన్యాయం బేసిన్‌లోని అన్ని రాష్టాల్ర మధ్య నీటి వాటాలు పంచినపుడు జరిగిందనే అంశం విస్మరించ కూడదు. రాయలసీమ వాసులు తమకూ అన్యాయం జరిగిందనే భావనతో ఉన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ కూడా 1969కి నిర్మింపబడిన లేక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాతిపదికగా తీసుకొని కృష్ణా జలాలను బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. తదుపరి 2004లో వచ్చిన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కూడా బచావత్‌ ట్రిబ్యునల్‌ పంపిణీ చేసి, వినియోగంలో ఉన్న నీటి కేటాయింపుల జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మరొక 448 టియంసిల నికర మిగులు జలాలు బేసిన్‌ మొత్తం విూద ఉంటాయని అంచనా వేసింది.

సుప్రీంకోర్టు స్టేతో ఉన్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలుకు రావచ్చు. అదే జరిగితే కృష్ణలో మరొక 285 టియంసిల నీళ్లను ఎగువ రాష్ట్రాలు తన్నుకుపోతాయి. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కర్ణాటకకు ఏకంగా 170 టియంసిలు కేటాయించింది. పైగా ఆల్మట్టి ఎత్తు 525 విూటర్లకు పెంచుకొనే వెసులుబాటు కల్పించింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నికరంగా దక్కేది కేవలం 38 టియంసిలు మాత్రమే. కాగా విద్యుదుత్పత్తి పేర మహారాష్ట్ర పశ్చిమ కనుమల నుండి ఎంత నీరు సముద్రం పాలు చేస్తోందో గణాంకాలు లేవు. ఈ కారణంగా ముందుగా గోదావరి, కృష్ణా జలాలలను అవసరం మేరకు ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచన చేయాలి. దీనివల్ల ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరగగలదు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP