05-07-2024 RJ
సినీ స్క్రీన్
’సరిపోదా శనివారం’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. నాని ఇందులో సూర్య అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన రెండో లుక్‌ను గురువారం విడుదల చేశారు. శనివారాల్లో యాక్షన్ కోణంలో హింసాత్మకంగా కనిపించే సూర్య.. మిగిలిన రోజుల్లో ఎలా ఉంటాడన్నది ఈ ప్రచార చిత్రంతో చూపించారు.
నాని ఆ పోస్టర్‌లో పక్కింటి కుర్రాడి తరహాలో బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ రావడం కనిపించింది. ‘వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్ చిత్రమిది. దీంట్లో నాని పాత్ర రెండు కోణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది‘ అని చిత్రవర్గాలు తెలిపాయి. ఇది ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది. సంగీతం: జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం: జి.మురళి.