05-07-2024
తెలంగాణ
హైదరాబాద్, జూలై 5: తెలంగణ శాసనమండలి ఉనికి ప్రమాదంలో పడిరదని మాజీ ఎంపీ బోయిన్‌లపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ విూడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 పకారం శాసన మండలిలో కనీసం సీట్లు 40 ఉండాలని, అంత కంటే తక్కువ ఉండకూడదన్నారు. శాసనసభ సీట్లలో మూడో వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలన్నారు. కేంద్రం ప్రభుత్వం గత టర్మ్‌లో చేసిన రాజ్యాంగ సవరణతో ప్రస్తుతం శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిరదన్నారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించిందని, దీంతో తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య 119కి తగ్గిందన్నారు. గత అసెంబ్లీ టర్మ్ ముగిసే వరకు ఆంగ్లో ఇండియన్ పదవీ కాలం ఉందని, దీంతో గత అసెంబ్లీ సమయం ముగిసే వరకు ఎలాంటి ముప్పు రాలేదని వినోద్ కుమార్ తెలిపారు.
కానీ కేంద్రం చేసిన రాజ్యంగ సవరణ కొత్త అసెంబ్లీ నుంచి అమల్లోకి వచ్చిందని, ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ సభ్యుడు అసెంబ్లీలో లేరని దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 119 మాత్రేనని, దాని ప్రకారం రాజ్యాంగ నిబంధనలు 1/3 కౌన్సిల్ సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కనీసం 40 మంది సభ్యులు ఉండాలనే నిబంధన ఉల్లఘించినట్లుగా అవుతుందన్నారు. దీనిపై ఎవరైనా కోర్టు వెళితే వెంటనే మండలి రద్దు అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణ శాసన మండలి కొనసాగాలి అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలని, చంద్రబాబు పస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారని, శనివారం నాటి ఇద్దరు సీఎంలు కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు కృషి చేయాలని ఆయన సూచించారు. విభజన చట్టం 26 సెక్షన్ ప్రకారం తెలంగాణలో 153కు, ఏపీలో 225కు అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉందన్నారు. గతంలో అసెంబ్లీ సీట్లను పూనర్విభజన చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదని, కుంటి సాకులు చూపిందన్నారు.
కానీ జమ్ము కశ్మీర్ లో అసెంబ్లీ సీట్లను పెంచుకున్నారని, కేంద్రానికి ఇష్టం ఉంటే సీట్లను పెంచుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి విభజన చట్టంలో పేర్కొన్న విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే విధంగా చూసి తెలంగాణ మండలి కొనసాగే విధంగా చూడాలన్నారు. శాసనమండలి అవసరమమని, పార్లమెంట్‌లో బిల్లు వచ్చిననాడు తాను సుదీర్ఘంగా ప్రసంగించానని ఆయన గుర్తు చేశారు. శాసనమండలిని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు.