05-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూలై 5: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడిరది. దాంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవమయ్యాయి.
తెదేపా సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు ఎన్‌డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి.హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. శాసనసభలో ఎన్‌డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వారిద్దరి ఎన్నిక లాంఛనంగా పూర్తయింది.