05-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 5: నగరం నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ఇండియన్ ఫార్మాస్యుటికల్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫార్మా క్లస్టర్లను ఓఆర్‌ఆర్ వెలుపల ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని తెలిపారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్ లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫార్మా రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ విదేశాలకు హైదరాబాద్ నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు.
టెక్నాలజీ అభివృద్ధిలో ఏఐ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాలు మాట్లాడారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఉన్నాయని అది రాష్టాన్రికి గర్వకారణమని భట్టి అన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మెడిసిన్ ఎగుమతి చేస్తున్నాం అన్నారు. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో అసమానమైన చురుకుదనం ప్రదర్శించి, అవిశ్రాంతంగా శ్రమించారని ఫార్మసిస్టుల సేవలను ఆయన కొనియాడారు. ఫార్మా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుంది అన్నారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి, ఇప్పుడు బిర్యానీతోపాటు బయో ఫార్మా ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. అందరికీ ఆరోగ్యం అందుబాటులో తీసుకొస్తే దృఢమైన ప్రపంచాన్ని నిర్మించగలమన్నారు. బౌల్ అఫ్ ఫార్మ గా హైదరాబాద్ స్థిరపడిరదన్నారు. సుగంధ ద్రవ్యాలను సరఫరా చేసే స్థాయి నుంచి మానవ జీవితాలను కాపాడే మందుల సరఫరా దశకు తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు.
ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది అన్నారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడిదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ఏఐను అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.వైఎస్‌ఆర్ హయాంలో ఓఆర్‌ఆర్ నిర్మించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దాంతో హైదరాబాద్‌కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటు అందించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.