ad1
ad1
Card image cap
Tags  

  06-07-2024       RJ

నేడు గోల్కొండ బోనాలు.. భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

తెలంగాణ

  • భారీగా పోలీసు బందోబస్తు 
  • బోనాల ఏర్పాట్లకు మంత్రుల నిధులు విడుదల
  • ఆలయాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు

హైదరాబాద్‌, జూలై 6: తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగను ఎంతో భక్తితో చేసుకుంటారు. ఆదివారం గోల్కొండ బోనాలతో పండగలు ప్రారంభం అవుతాయి. తరవాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనమెత్తుతారు. తరవాత పాతబస్తీ లాల్‌దర్వాజ అమ్మవారి బోనాలు వరుస ఆదివారాల్లో జరుగుతాయి.  గోల్కొండ బోనాల జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కోటలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుక సిటీలో దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. కోటలోని అమ్మవారికి ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. ఈ నెల 14న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 21న లాల్‌ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారికి యాత్రికులు బోనాలు సమర్పిస్తారు. తిరిగి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో వేడుక ముగియనుంది. జాతర ప్రారంభ సూచికగా జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు స్థానికులు శుక్రవారం పూజలు చేశారు. సిటీలో అత్యంత వేడుకగా జరిగే బోనాల జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. సిటీలోని అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేసినట్లు వెల్లడించారు.

సంబరాలు ప్రశాంతంగా జరిగేలా పలు సెన్సిటివ్‌ ఏరియాలలో బలగాలను మోహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆషాడ మాసంలో బోనాల శోభతో రాష్ట్రమంతట కూడా అమ్మవారి ఆలయాల్లో ఆదివారం, గురువారం బోనాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా బోనాల పండుగ ఆదివారం జులై 7 నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర, దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.  శనివారం బేగంపేట హోటల్‌ హరితా టూరిజం ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలు 2024కి సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్‌ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాల వేళ బోనాలను పటిష్టంగా నిర్వహిస్తామని మంత్రి సురేఖ తెలిపారు. తమకు ఇప్పుడు కలిసి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అందరికీ ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి, మంచి పంటలు పండాలని ప్రజలంతా సంతోషాలతో ఉండలని అమ్మవారిని కోరుకుంటున్నామన్నారు.

జూలై 7వ తేదీ నుండి గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలను ఘనంగా జరపడానికి ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఉత్సవాల విజయవంతానికి హైదరాబాద్‌ ప్రజల సహకారం కావాలని అన్నారు. ఏ విధమైన సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరుపున అధికారులను ఆదేశించామన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడి అదనపు నిధులు తీసుకొచ్చారన్నారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇదిలావుంటే ఆషాడమాసంలో గ్రామదేవతలను పూజించే సంప్రదాయం విస్తృతంగా కనపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ సంప్రదాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. బోనాల విషయానికొస్తే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ తో పాటూ తెలంగాణ వ్యాప్తంగా,రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉండే హిందువులు జరుపుకుంటారు.

భాగ్యనగరంలో బోనాలంటే ఆ కళే వేరు. దీన్నే ఆషాడం జాతర అనికూడా పిలుస్తారు. 1869లో జంట నగరాలలో ప్లేగువ్యాధి వ్యాపించినప్పుడు అమ్మవారి ఆగ్రహానికి గురయ్యామని భావించిన ప్రజలంతా అమ్మను శాంతింపజేసేందుకు ఈ పండుగ చేయడం ప్రారంభించారు.  ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ ఆలయం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్‌, పాతబస్తీ ఆలయాల్లో వరుసగా జరుగుతుంది. ఈ ఉత్సవాల వేడుకల్లో  ప్రధానమైనవి 8 అంగాలు.. ఘటోత్సవం, బోనాలు సమర్పించడం మొదలు.. రంగం, నిమజ్జనం వరకు ఉంటాయి.  ప్రత్యేకమైన ఘటం (కలశం)లో అమ్మవారిని ఆవాహనచేసి ఊరేగింపుగా తీసుకెళతారు. బోనాలు ప్రారంభమైన మొదటి రోజు( జులై 7నుంచి)  నుంచి పద్నాలుగో రోజు వరకూ ప్రతి రోజూ రెండు పూటలా అమ్మవారు కలశం రూపంలో నగరాల్లో, ఊర్లలో తిరుగుతూ భక్తుల నుంచి పూజలందుకుంటుంది. ఘటం అంటే కళశం నగరవీధులగుండా ఉరేగింపుగా తీసుకెళతారు. ఈ ఘటంపై అమ్మవారి రూపాన్ని చిత్రీకరిస్తారు. ఆలయ పూజారి ఒళ్లంతా పసుపు పూసుకుని ఘటాన్ని ఊరేగిస్తారు.. బోనం అంటే భోజనం.. అనుక్షణం కాపాడే శక్తి స్వరూపిణికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే ఆహారం.

ఎవరెవరు ఎలాంటి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకున్నారో అవన్నీ అమ్మకు చెల్లిస్తారు. ముఖ్యంగా చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, క్టటెపొంగలి, పసుపు అన్నం ఇలా వివిధ రకాల ఆహారాన్ని సమర్పిస్తారు. ఇల్లు వాకిలి శుభ్రంచేసి, తలకు స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి ..నైవేద్యం తయారు చేస్తారు. పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన పాత్రలో అన్నాన్ని ఉంచి దానిపై మూతపెట్టి దీపం వెలిగించి..గుంపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. సర్వ రోగనివారిణి అయిన వేపాకులను ఎన్నో ఔషధ గుణాలన్న పసుపునీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారాన్నే వేపాకు సమర్పించడం అంటారు. వానాకాలం మొదలైన సందర్భంగా వ్యాపించే క్రిమికీటకాలను తరిమికొట్టేందుకు క్రిమినాశినిగా వేపాకు ఉపయోగపడుతుంది... పైగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం కూడా ఇదే.  బోనాలు  జరుపుకునే రోజు భక్తులంతా..నియమ నిష్టలతో తయారు చేసిన నైవేద్యాలను తీసుకొచ్చి బండ్లలో పెట్టిన తర్వాత ఆ బండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. దీనినే ఫలహారబండి ఉత్సవం అంటారు. పోతురాజు అంటే ఏడుగులు అమ్మవార్లకు సోదరుడు. బోనాలు పండుగలో పోతురాజలే ప్రత్యేక ఆకర్షణ. ప్రతి బస్తీనుంచి పోతురాజు అమ్మవారి ఆలయం వరకూ విన్యాసాలు చేసుకుంటూ వెళతారు.

కాళ్ళకి గ్జజెలుకట్టి, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో ముంచిన ఎర్రటి వస్త్రాన్ని ధరించి...కళ్లకు కాటుక, కుంకుమతో పెద్ద బొట్టు, నడుముకు వేపాకు చుట్టి..పసుపు రంగు కొరటా రaుళిపించి నాట్యం చేస్తూ ఫలహారం బండి ముందు నడుస్తాడు. రంగం బోనాలలో చివరి రోజు జరిగే ముఖ్యమైన ఘట్టం రంగం. అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఓ స్త్రీ  మట్టి కుండ విూద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల గురించి అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది. రంగం ముగిసిన మర్నాడు పోతురాజులు అమ్మవారి సన్నిధిలో భక్తితో తాండవం చేస్తారు. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి కూరగాయల్ని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. అప్పట్లో జంతువులను బలిచ్చేవారు. బలిచ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి కలశాలతో పాటూ ఏనుగుపై ఎక్కించి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించి నిమజ్జనం చేస్తారు. 

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP