06-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 6: టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ సర్కార్ వెసులుబాటు కల్పించింది. ఇప్పటినుంచి ఏడాదికి రెండుసార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ లో ఒకసారి, డిసెంబర్ లో ఒకసారి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా టెట్ ఎగ్జామ్ రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలియజేసింది. టెట్ పరీక్ష పాస్ అయిన వారు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులను డీఎస్సీలో వెయిటేజీగా ఇవ్వనున్నారు.