08-07-2024 RJ
ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం, జూలై 8: వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రజలు ఓటు వేశారని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన భాజపా రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీయే కూటమి విధానాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారన్నారు. ఐదో ఆర్థికశక్తిగా భారత్ ఎదగడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఆలోచిస్తారని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. మూడోసారి బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారని చెప్పారు. రైతుల ఖాతాలకు రూ.20 వేల కోట్లను జమచేస్తూ రెండో సంతకం చేశారని గుర్తు చేశారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేసారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడిరచారని తెలిపారు.
బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని ఎంపీ పురందేశ్వరి వెల్లడిరచారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగిందన్నారు. 2019లో బీజేపీకి 23 కోట్ల ఓట్లు వచ్చాయని.. 2024 ఎన్నికల్లో 24 కోట్ల ఓట్లు వచ్చాయని తెలిపారు. బీజేపీకి గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓట్ల సంఖ్య పెరిగిందన్నారు. ప్రతిపక్షాల దుష్పచ్రారం వల్ల ఎంపీ సీట్ల సంఖ్య కొంచెం తగ్గిందన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిందన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి ఏపీకి సుపరిపాలన అందిస్తుందని ప్రజలు అధికారం ఇచ్చారని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీలు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, సుజనాచౌదరి, ఈశ్వరరావు, పార్థసారధి హాజరయ్యారు. కార్యక్రమంలో సోము వీర్రాజు తదితర కూడా పాల్గొన్నారు.