ad1
ad1
Card image cap
Tags  

  08-07-2024       RJ

నదుల అనుసంధానానికి ఆద్యుడు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్

  • పట్టిసీమ నిర్మాణంతో సుసాధ్యం చేసి చూపారు
  • వృధా గోదావరి జలాలలను కృష్ణా ఆయకట్టుకు తరలించారు
  • పట్టిసీమ సంగమ ప్రాంతంలో పూజలు చేసిన మంత్రి నిమ్మల

విజయవాడ, జూలై 8: దీక్ష, దక్షతకు, సీఎం చంద్రబాబు ముందుచూపుకు పట్టిసీమ నిదర్శనం అని  ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు నిర్మూలించవచ్చని కెయల్‌ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు. గోదావరి నుంచి మూడు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వదులుతున్నారని, వృధా అవుతున్న నీరుని కృష్ణాడెల్టాకు మళ్లించారని చెప్పారు. నీటిని స్దవినియోగం చేసుకుంటే మనకు అవసరాలు తీరుతాయని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. శ్రీశైలం నీరు రాయలసీమకు ఇచ్చి కరవును పారదోలాలని సీఎం చంద్రబాబు భావించారని, పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందనే పట్టిసీమ నిర్మాణం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మొత్తం 24 పంపులను విడతలవారీగా రన్‌ చేసి ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు.

గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణా నదిలో కలపడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ముందుచూపు తో పది లక్షల ఎకరాలకు సాగు నీరు, ముప్పై లక్షల మందికి తాగు నీరు ఇచ్చారని తెలిపారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్‌ రాజకీయాలకు అనర్హుడని, కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టులను పూర్తి గా నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 50 వేల కోట్ల ఆదాయం రైతులకు పట్టిసీమ ద్వారా వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసలు రాజకీయాలకు జగన్‌ అనర్హుడని, రైతులు, ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పట్టిసీమ లేకపోతే అసలు కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటో అందరూ ఆలోచన చేయాలన్నారు. పులిచింతల నిండాలంటే శ్రీశైలం, సాగర్‌ నిండితేనే వచ్చే పరిస్థితి అని అన్నారు. ప్రతి యేడాది 35 టీఎంసీల నీటిని నిల్వ పెట్టుకుని రైతులు పంటలు పండిస్తారని, గత ఐదెళ్లల్లో జగన్‌ పాలనలో పులిచింతలను కూడా ఎండ పెట్టారని మంత్రి దుయ్యబట్టారు. కనీసం అర టీఎంసీ నీరు కూడా లేకుండా జగన్‌ చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజలను భక్షించే విధంగా జగన్‌ పాలన సాగిందని, పోలవరం పూర్తి అయ్యే వరకు పట్టిసీమ డెల్టాని కాపాడుతుం దన్నారు.

మూడు రోజుల్లో 12 అడుగుల నీటి మట్టం చేరుతుందని, ఆ తరువాత సాగు, తాగు నీటిని కిందకి విడుదల చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని మాట్లాడుతూ.. నదుల అనుసంధానం సృష్టి కర్త సీఎం చంద్రబాబు అని, 2014 లోనే ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారని అన్నారు. కృష్ణా డెల్టాను కాపాడి రైతుల ఇంట్లో పండుగ తెచ్చారని, జగన్‌ వచ్చాక పట్టిసీమను పడుకోపెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఐదేళ్లల్లో రైతులు ఇబ్బందులు పడ్డారని, దేవినేని ఉమ అప్పట్లో ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టును పూర్తి చేయించారన్నారు. పవిత్ర సంగమం వద్ద గతంలో లాగా హారతులు కార్యక్రమం చేపట్టాలని, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలన్నారు. పట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందని, చంద్రబాబు ముందు చూపుకు అన్నదాతల్లో ఆనందం వెల్లి వెరిస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని అన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP