10-07-2024 RJ
తెలంగాణ
వరంగల్, జూలై 10: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి లో బోనాల మహోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తుకొని సందడి చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కట్టమైసమ్మకు బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి.. తెలంగాణ ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కట్టమైసమ్మ తల్లిని ప్రార్థించానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేతలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం విూడియాతో మాట్లాడిన మంత్రి తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేస్తుందన్నారు. అభివృద్ది, సంక్షేమం, దేవాలయాల అభివృద్దికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.