10-07-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూలై 10: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ జరిగిన కేసును ఛేదించినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడిరచారు. ఈనెల 9న బాధితుడు కుటుంబంతో సహా వ్యక్తిగత పని నిమిత్తం విజయవాడకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు 24గంటల్లోనే కేసు ఛేదించి సొత్తును బాధితులకు అప్పగించారు. ఈనెల 9న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుటుంబం విజయవాడకు వెళ్లడంతో దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారా పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలు కలిపి సుమారు కోటి విలువైన సొమ్మును చోరీ చేశారు.
ఊరి నుంచి వచ్చిన బాధితులు దొంగతనం జరిగినట్లు గుర్తించి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులే దొంగతనం చేసి ఉంటారని భావించి దర్యాప్తు ప్రారంభించాం. చోరీ అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించాం. దొంగతనం జరిగిన ప్రాంతంలో కొన్ని వేలిముద్రలు గుర్తించాం. గంధంగూడకు చెందిన ప్రవీణ్ అనే అనుమానితుడి వేలిముద్రలు.. దొంగతనం జరిగిన ఇంట్లో వేలిముద్రలతో సరిపోయాయి. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నాం. విచారణ అనంతరం నిందితుడి నుంచి చోరీకి గురైన సొత్తు మె?త్తం స్వాధీనం చేసుకున్నాం. కేసును కేవలం 24గంటల్లోనే ఛేదించాం’ అని డీసీపీ శ్రీనివాస్ వెల్లడిరచారు.